400 మామిడిచెట్లు దగ్దం... కన్నీరు మున్నీరైన రైతు

SMTV Desk 2019-05-08 11:52:22  mangos,

మంచిర్యాల: ప్రమాదవశాత్తు 400 మామిడి చెట్లు దగ్థమైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం గంగారం గ్రామం సమీపంలో సంభవించింది. గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఉన్న కరెంటు తీగలు ఒకదానికొకటి తగలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు చెట్లపై పడటంతో సుమారు నాలుగు వందలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయి.స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. మామిడి సీజన్ నడుస్తుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో రైతు కన్నీరు మున్నీరు అవుతున్నాడు.