ప్రియాంక చోప్రా ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

SMTV Desk 2019-05-08 11:45:05  Priyanka chopra,

న్యూయార్క్ లోని ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియంలో 71 వ మెట్ గాలా వేడుకలు సంబరాన్ని మిన్నంటాయి . ఈ వేడుకల్లో హాలీవుడ్ కు చెందిన ప్రముఖులు వివిధ రకాల డ్రెస్ లలో ఆకట్టుకుంటున్నారు. ఈ ఈవెంట్ కి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి వెళ్లింది. ఆ ఈవెంట్ కి ఆమె ఇచ్చిన ఫోజు, ఆమె ధరించిన కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పిచ్చుక గూడులాంటి జుట్టుతో ఉల్లిపొరలాంటి డ్రెస్ తో ఆకట్టుకుంది. ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహించే ఈ మెట్ గాలా కోసం ఫ్యాషన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆమె హెయిర్ స్టైల్ చూసి అందరూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు