అమరావతి లో భారీవర్షం

SMTV Desk 2019-05-08 11:44:12  Rain, Amaravati

ఆంధ్రప్రదేశ్ అమరావతి లో గాలివాన భీభస్తమ్ సృష్టిస్తుంది .. దానికితోడు భారీవర్షం కూడా ముంచెత్తింది. గాలుల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్‌, ఎంట్రీ పాయింట్‌ కుప్పకూలాయి. సచివాలయంలోని రెండో, నాలుగు బ్లాకుల్లోని టెర్రస్‌లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు ఐదు నిమిషాల పాటు ఈదురు గాలులు వీచాయి. ‘స్మార్ట్ పోల్’ ను రూ.25 లక్షలతో ఏర్పాటు చేశారట.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అద్దాలు పగిలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి– తెనాలి మార్గమధ్యలో కోకాకోలా కంపెనీ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్దిరాల మండలాల్లో, పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీవర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మంగళగిరిలో సైతం వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది.