హానర్ 20 లైట్‌ రిలీజ్

SMTV Desk 2019-05-08 11:38:29  honor, honor 20 lite

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 20 లైట్‌ను ఇవాళ మలేషియా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.15,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 21వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.