నా కూతురిని క్రికెట్ ఆడనివ్వను...మా మతం ఒప్పుకోదు : అఫ్రిది

SMTV Desk 2019-05-08 11:37:45  shahid afridi, the gae changer book

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ కాప్టెన్ సాహిద్ అఫ్రిది తాజాగా గేమ్ ఛేంజర్ పేరుతో తన ఆటో బయోగ్రఫీ రచించి అభిమానుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలో అఫ్రిది పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కూతురిని క్రికెట్ ఆడేందుకు తాను అనుమతించనని.. అందుకు తమ మతం ఒప్పుకోదని అతను తన పుస్తకంలో పేర్కొన్నాడు. కేవలం ఇండోర్ ఆటలకు మాత్రమే అనుమతిస్తానని కూడా తెలిపాడు. అక్సా 10వ తరగతి, అన్షా 9వ తరగతి చదువుతున్నారు. వాళ్లు గొప్ప తెలివైన వాళ్లు.. మంచి క్రీడాకారులు కూడా. అజ్వా, అస్మారా చిన్నపిల్లలు. ఇండోర్ ఆటలు ఆడేందుకు వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ వారితో క్రికెట్ అస్సలు ఆడించను.అందుకు మా మతం, మా సంఘం అంగీకరించదు. స్త్రీవాదులు ఏమైనా అనుకోనీయండి. కానీ ఒక సాంప్రదాయ పాకిస్థానీ తండ్రిగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అఫ్రిదీ తన పుస్తకంలో రాశాడు.