త్వరలో మార్కెట్లోకి "ఐఫోన్ 8"..!!

SMTV Desk 2017-08-24 13:19:08  I-PHONE SERIES 8, RELEASE DATES, MAX 4 EVER WEBSITE.

ముంబై, ఆగస్ట్ 24 : ఐఫోన్ ప్రియులకు ఒక శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆపిల్ స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ 8 సిరీస్ ను ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 12 న ఆవిష్కరించి 22 వ తేదీన అమ్మకాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇదివరకే ఐఫోన్ 8 ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన దీనికి సంబంధించిన తేదీలను మాత్రం వెల్లడించలేదు. కొన్ని కారణాల వల్ల ఐఫోన్ 8 ఆవిష్కరణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాని అలాంటిదేం లేదని ప్రముఖ ఫ్రెంచ్ టెక్నాల‌జీ వెబ్‌సైట్ మాక్‌4ఎవ‌ర్ తెలియ‌జేసింది. ఐఫోన్ 8 లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌, 3డీ కెమెరా, ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ వంటి ఇత‌ర ఫీచ‌ర్లతో రాను౦డడంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఫోన్ ఖరీదు రూ. 65,000కు పైనే ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ తో పాటు ఐఫోన్ 7ఎస్‌, ఐఫోన్ 7ఎస్ ప్లస్ లను కూడా విడుదల చేయనున్నారని మాక్‌4ఎవ‌ర్ తెలిపింది.