మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాకి టైటిల్ ఫిక్స్

SMTV Desk 2019-05-08 11:31:47  vaishanav tej, sai dharam tej, mega hero

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ మధ్య ఒక సినిమాను లాంచ్ చేశారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడిగా కనిపిస్తాడు. అందువలన ఈ సినిమాకి జాలరి అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాకి ఉప్పెన అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారనే సంగతి తెలిసిందే.