ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ కలెక్షన్స్ తెలిస్తే షాక్

SMTV Desk 2019-05-08 11:27:55  Avengers end game,

ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్.. ఇప్పుడు ప్రపంచ సినీ ప్రేక్షకులందరినీ షేక్ చేసేస్తున్న సినిమా గత శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలయి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కాబోతోంది. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఏ హాలీవుడ్ సినిమాకూ లేని విధంగా విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది ఈ చిత్రానికి ఇండియాలో. మన లోకల్ సూపర్ స్టార్ల సినిమాలకు ఎలా అయితే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయో.. ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ టికెట్లు కూడా అలాగే హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. ఇండియాలో ఏ హాలీవుడ్ చిత్రానికి రాని స్థాయిలో దీనికి వసూళ్లు వస్తాయనడంలో మరో మాట లేదు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ సినిమా విడుదల కానంత భారీగా ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ రిలీజయింది. దీని కలెక్షన్లు కూడా ఊహించని స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటి వరకూ ‘అవతార్’ పేరిట ఉన్న ఓవరాల్ కలెక్షన్లను ఇది బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. ఓపెనింగ్స్ విషయంలో ‘అవతార్’ను అధిగమించే సినిమాలు వచ్చాయి కానీ.. ఓవరాల్ కలెక్షన్లలో పదేళ్లుగా అదే అగ్రస్థానంలో ఉంది. ఆ చిత్రం వరల్డ్ వైడ్ 2.7 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.19 వేల కోట్లు వసూలు చేయడం విశేషం. ‘ఎవెంజర్స్’ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన ‘ది ఇన్ఫినిటీ వార్’ ఈ రికార్డును దాటుతుందనుకున్నారు కానీ.. అది 2 బిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది. ఐతే దాంతో పోలిస్తే ‘ది ఎండ్ గేమ్’ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. వరల్డ్ వైడ్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించడమే కాక ప్రపంచంలో 3 బిలియన్ డాలర్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా కూడా రికార్డు నెలకొల్పుతుందేమో చూడాలి మరి.