మరో విమాన ప్రమాదం....14 మంది మృతి

SMTV Desk 2019-05-07 16:24:27  Las Vegas and Monterrey in northern Mexico, Bombardier

మెక్సికో: ఆదివారం సాయంత్రం యూఎస్‌లోని లాస్‌ వేగాస్‌ నుండి బాంబార్డీర్‌ ఛాలెంజర్‌ 605 బిజినెస్‌ జెట్‌ ఉత్తర మెక్సికోలోని మోన్‌టెర్రేకు బయలుదేరింది. ఆ తరువాత కమ్యునికేషన్‌ వ్యవస్థకు దూరమైందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ చెప్పారు. దీంతో ఆ జెట్ కూలిపోయి ఉంటుందని మెక్సికో రాష్ట్ర అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆజెట్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. కాగా మృతుల్లో 11 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు వారందరూ కూడా మరణించినట్లు తెలిపారు. తీవ్రంగా ధ్వసంమైన స్థితిలో ఉన్న ఆ విమానాన్ని సోమవారం అధికారులు గుర్తించారు. కొహిలాకు దగ్గర్లో విమాన శకలాలను గుర్తించారు. మెక్సికో, యూఎస్‌కు చెందిన బాక్సర్ల ఆటను వీక్షించడం కోసం శనివారం వీరంతా విమానంలో లాస్‌వేగాస్‌కు వెళ్లినట్లు మెక్సికన్‌ మీడియా వెల్లడించింది.