ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

SMTV Desk 2017-08-24 12:47:48  KHAIRATHABAD, TRAFFIC RESTRICTIONS, LORD GANESH

హైదరాబాద్, ఆగస్ట్ 24 : రేపు జరగనున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గణేశుడిని సందర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు రానున్న తరుణంలో ట్రాఫిక్ ను మళ్లి౦చనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 4 వ తేది వరకు రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వివరించారు. *మింట్ కాంపౌండ్ లైన్, నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్‌ వైపునకు అనుమతి లేదు. ఖైరతాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ వాహనాలను దారి మళ్లి౦చనున్నారు. *రాజ్ దూత్ హోటల్ లైన్, ఖైరతాబాద్ మార్కెట్ వైపు నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలకు కూడా అనుమతి లేదు. లైబ్రరీకి వెనుక వైపున ఉన్న ఎంసీహెచ్ శానిటరీ వార్డు కార్యాలయం వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. *రాజీవ్‌ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా వినాయకుడి వైపునకు వాహనాలు అనుమతించరు. వాటిని నిరంకారీ కూడలి వైపు మళ్లిస్తారు