వైరల్: వాట్సాప్ లోకి డెలీవరీ వీడియో

SMTV Desk 2019-05-07 16:20:55  delivary video.. khammam,

ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఎంత అశ్రద్దతో పనులు చేస్తున్నారో మనం డైలీ చూస్తుంటామ్ అయితే సరిగ్గా ఒక సంఘటన చోటుచేసుకుంది . పురుటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళకు డెలీవరీ చేసే సమయంలో హెడ్ నర్స్ వీడియో తీసి, దాన్ని వాట్సాప్‌లో అందరికీ షేర్ చేసింది. కలకలం రేపుతున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.

వైద్యులను, వైద్య సిబ్బందిని దేవుళ్ళుగా కొలుస్తారు రోగులు. కానీ వారే ఇలాంటి పనులు చేస్తూ.. వైద్య వృత్తికి మచ్చ తీసుకొస్తున్నారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్.. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.