హైదారాబాద్ పాతబస్తీలో దారుణం

SMTV Desk 2019-05-07 16:08:50  Murder,

హైదరాబాద్‌లోని పాతబస్తీలోని వట్టేపల్లి రోషన్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో వడ్డేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అత్తాకోడళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. అత్త నబీనా బేగం(55), కోడలు తాయబ్(25)ను తల్వార్‌తో నరికి చంపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు ..

దుండగులు ఇంట్లో బీరువా పగులగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.‌ హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతులను తాండూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ హత్యలు దొంగలే చేశారా లేదంటే… దీని వెనుక మరేదైనా కోణం వుందా అని హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన వడ్డేపల్లి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.