అర్జున్ రెడ్డి చిత్రం తొలి సన్నివేశం లీక్...

SMTV Desk 2017-08-24 12:35:49  Arjun reddy, Vijay devarakonda, Social Media, Introduction scene

హైదరాబాద్, ఆగస్ట్ 24: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం రేకెత్తిస్తున్న అర్జున్ రెడ్డి చిత్రం రేపు విడుదలకు సిద్ధంగా వుంది. అయితే తాజాగా మరో సంచలనానికి తెర తీసింది ఈ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన తొలిసన్నివేశం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తుంది. కాగా ఈ చిత్రం మొదట సన్నివేశంలో మత్తుకు బానిస అయిన అర్జున్ రెడ్డి అసలు పాత్రతో మొదలవుతుంది. అర్జున్ రెడ్డి సోఫా సెట్లో కూర్చుని ఉండగా, తన ముందు మద్యం సీసాలు దొర్లుతుంటాయి. ఈ సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది. సోఫాకు ఒక ప్రక్క నుండి సన్నటి నీటి ధార కనిపిస్తుంది, అయితే అది నీరు కాదు అంటూ ప్రేక్షకుల ఉహాగానాలు ఊపందుకున్నాయి. మొదట నుండి ఎన్నో సంచలనాలతో అభిమానులను అలరించిన ఈ చిత్రం విడుదల అనంతరం ఏ మేరకు ప్రేక్షకుల ఆదరిస్తారో తెలియాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే. అయితే చిత్ర బృందం మాత్రం అన్నిరకాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.