వరల్డ్ కప్...టైటిల్ పోరులో నిలిచే సత్తా భారత్‌కు ఉంది: వెంగ్‌సర్కార్

SMTV Desk 2019-05-07 15:58:04  DILIP VENGSARKAR, ICC WORLD CUP 2019

ముంభై: ఈ నెల 14న ముంభై క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సచిన్, గవాస్కర్‌, దిలీప్ వెంగ్‌సర్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ... ప్రస్తుత జట్టును చూస్తే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ సేన కప్ సాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఫైనల్ గురించి ఇప్పుడే అంచనా వేయలేను. టైటిల్ పోరులో నిలిచే సత్తా భారత్‌కు ఉంది. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికి విజయం చేకూరాలని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో విఫలమైనంత మాత్రాన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదు. టీ20, వన్డే ఫార్మాట్‌కు తేడా ఉంటుంది. వన్డేల్లో అతను కచ్చితంగా తిరిగి పుంజుకుకుంటాడు. ముంబై ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) యువ క్రికెటర్లకు చక్కటి వేదిక. త్వరలో జరిగే రెండో సీజన్‌లో 160 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో తొలి సీజన్‌లో ఆకట్టుకున్న వాళ్లు ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నారు. ఈ లీగ్‌ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు.