మార్కెట్లోకి ‘సెక్స్ రోబోట్స్’

SMTV Desk 2019-05-07 15:52:40  lupi dolls, sex robots

జపాన్: జపాన్ సాంకేతిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. అయితే తాజాగా ప్రపంచంలోనే విరుగుడు లేని ఎయిడ్స్ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని జపాన్ ఓ కొత్త పరికరాన్ని తాయారు చేసింది. అవే ‘సెక్స్ రోబోట్స్’. స్త్రీతో పని లేకుండా పురుషులు శృంగారంలో తృప్తి పడేలా ఈ రోబోలు ఉపయోగపడతాయంట. శృంగారంలో రెచ్చిపోవాలనుకునే వ్యక్తులు వాటితో ఎటువంటి తరహాలోనైనా సెక్స్ చేయవచ్చట. ఇందుకు అవి పూర్తిగా సహకరిస్తాయట. అందుకే వీటితో ఏకంగా ‘రెడ్ లైట్’ ఏరియానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నాలుగు ఆడ రోబోలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు.త్వరలో మగ సెక్స్ రోబోలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లుమీడాల్స్ అని పిలిచే ఈ సెక్స్ రోబోలతో గడపాలంటే కొంచెం గట్టిగానే చెల్లించుకోవాలి. మూడు గంటల సేపు వాటితో గడపాలంటే రూ.22,670 చొప్పున చెల్లించాలి. ఒక గంట చాలనుకుంటే రూ.8,162 చెల్లించాలి. ప్రపంచంలో తొలి హైపర్ రియలెస్టిక్ సెక్స్ డాల్ వ్యభిచార కేంద్రం ఇదేనని, ఈ రోబోలు అచ్చం మనుషుల్లాగే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మొరటుగా సెక్స్ చేయాలనుకునేవారికి ఇవే సరైనవని, వీటితో వారు ఏ విధంగానైనా సెక్స్‌లో పాల్గోవచ్చని తెలిపారు. వీటితో సెక్స్ చేస్తున్నంత సేపు.. నిజమైన మహిళతో చేస్తున్నట్లే ఉంటుందన్నారు. దీంతో ఎయిడ్స్ కు కాస్త దూరంగా ఉండవచ్చని అంటున్నారు.