అక్షయ తృతీయ: ఎగిసి పడుతున్న పసిడి ధరలు

SMTV Desk 2019-05-07 13:14:11  akshaya truteeya, gold rate

న్యూఢిల్లీ: మంగళవారం (మే7) న అక్షయ తృతీయ సందర్భంగా పసిడి ధరలు పైకి ఎగిసాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర 75 రూపాయలు పెరిగి రూ.33,720 కి చేరింది. ఇదిలా ఉంటె బంగారం ధర పెరగ్గా.. వెండి ధర మాత్రం తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో కిలో వెండి ధర రూ.70 తగ్గి రూ.38,130కి చేరింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,282.60 డాలర్ల వద్ద, వెండి ధర 14.91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,550 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 33,720 వద్ద కొనసాగుతున్నాయి. సార్వత్రిక పసిడి పథకంలో 8 గ్రాములు బంగారం ధర రూ.26,400 వద్ద కొనసాగుతోంది. ఇక వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.313 పెరిగి రూ.37,290 వద్ద కొనసాగుతున్నాయి.100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద కొనసాగుతున్నాయి.