ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌పై గుడ్డుతో దాడి

SMTV Desk 2019-05-07 12:32:16  women attacks with egg Australia PM Scott Morrison, A young protester tried to egg Prime Minister Scott Morrison at a campaign event

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌పై ఓ మహిళా గుడ్డుతో దాడి చేసింది. స్కాట్‌ సాధారణ ఎన్నికల భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...కెనబెరా సమీపంలోని అల్బురీలో మహిళా సంఘం సమావేశంలో స్కాట్ మారిస‌న్ మ‌హిళ‌ల‌తో ముచ్చ‌ట‌పెడుతున్న స‌మ‌యంలో వెనక నుండి ఓ మహిళ ఆయన తలపై గుడ్డును విసిరింది. అయితే గుడ్డు పగలలేదు. ఈ ఘ‌ట‌న‌లో 25 ఏళ్ల మ‌హిళ‌ను పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. ఓ పిరికి వ్య‌క్తి గుడ్డు విసిరిన‌ట్లు ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆస్ట్రేలియాలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌ల‌పైన కూడా గుడ్ల దాడి జ‌రిగింది. మే 18వ తేదీన ఆస్ట్రేలియాలో జాతీయ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.