సూర్యుడు ఉదయించే వేళ మరీ చిన్నగా నక్షత్రంలా కనిపించాడట!!

SMTV Desk 2019-05-07 12:27:47  nasa, sun rise, sun set, mars,

భూమి మీద సూర్యుడు ఏవిధంగా ఉదయించి.. అస్తమిస్తున్నాడో... అరుణ గ్రహంపై కూడా అదేవిధంగా ఉదయించి అస్తమిస్తున్నాడు. ఈ విషయాన్ని నాసా క్యాప్చర్ చేసింది. అరుణ గ్రహంపైకి నాసా పంపిన ఇన్ సైట్ లాండర్ ఈ ఫోటోలను తీసి పంపించింది. భూమి కన్నాఅరుణ గ్రహానికి సూర్యుడు చాలా దూరంలో ఉంటాడు.

దీంతో.. సూర్యుడు ఉదయించే వేళ మరీ చిన్నగా నక్షత్రంలా కనిపించాడు. ఆ తర్వాత కాస్త పెద్దదిగానూ.. సాయంత్రం అస్తమించే సమయంలోనూ మళ్లీ చిన్న నక్షత్రంలా మారిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇన్ సైట్ లాండర్ లోని రోబోటిక్ హస్తం తన కెమేరాలతో ఈ ఫోటోలను క్యాప్చర్ చేసింది. మన భూతలం కన్నా మూడింట రెండు వంతుల చిన్నగా సూర్యుడు కనిపించినట్లు వారు చెబుతున్నారు. గత నెల 24 న, ఆ తరువాత కొన్ని గంటలకే 25 న ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యోదయ, అస్తమయాలను లాండర్ క్యాప్చర్ చేయగలిగింది. మార్స్ పై మొదటిసారిగా భూప్రకంపనలను ఈ లాండర్ నమోదు చేసిన విషయం గమనార్హం.