ఉమెన్స్ ఐపీఎల్: విజయ భేరిని మోగించిన స్మృతిసేన

SMTV Desk 2019-05-07 12:20:38  womens ipl 2019, Trailblazers vs supernovas

జైపూర్: సోమవారం ప్రారంభమయిన ఐపీఎల్ మహిళల క్రికెట్ టోర్నీలో జైపూర్ వేదికగా సూపర్ నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టు 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత ఓపెనర్/కెప్టెన్ స్మృతి మంధాన (90: 67 బంతుల్లో 10x4, 3x6) శతక సమాన ఇన్నింగ్స్‌‌ ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ట్రైల్‌బ్లాజర్స్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (46 నాటౌట్: 34 బంతుల్లో 8x4) దూకుడుగా ఆడటంతో.. ఒకానొక దశలో సూపర్ నోవాస్ జట్టు గెలిచేలా కనిపించింది. కానీ.. ఆఖరి ఓవర్‌లో సూపర్ నోవాస్ జట్టు విజయానికి 19 పరుగులు అవసరమవగా.. జులన్ బౌలింగ్‌లో.. తొలి ఐదు బంతుల్లోనే 4 ఫోర్లు కొట్టిన హర్మన్‌ప్రీత్ మ్యాచ్‌ని ఉత్కంఠగా మార్చేసింది. అయితే.. ఆఖరి బంతికి మూడు అవసరమైన దశలో హర్మన్‌ప్రీత్ కనీసం బంతిని టచ్ కూడా చేయలేకపోయింది. అయినప్పటికీ పరుగు కోసం ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి వెళ్లిన తహుహు (0) రనౌటైంది. మ