60 వరకు 108 వాహనాలు కాలి బూడిద

SMTV Desk 2019-05-07 12:08:54  108 abulence, fires

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 108 వాహనాల సర్వీస్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు 60 వరకు 108 వాహనాలు కాలి బూడిదయ్యాయి.

అదేవిధంగా పాడుబడ్డ 108 వాహనాలను అక్కడ పార్క్‌ చేస్తుంటారు. మంటలు భారీగా ఎగసిపడటంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు షార్ట్‌సర్కూటే కారణమని సమాచారం అందుతుంది.