ప్రశాంతంగా తొలి విడత పరిషత్ ఎన్నికలు

SMTV Desk 2019-05-07 12:03:42  Elections,

తెలంగాణలో తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. తొలివిడుతలో 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 10న రెండో విడుత, మే14న మూడో విడుత ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలను మే 27న విడుదల చేస్తారు.