మాస్టారులు మేలుకోండి అంటున్న కొమరం భీం జిల్లా వాసులు

SMTV Desk 2017-08-23 18:33:29  Komaram bheem district, Govt schools, Masters, JAC, adilabad

కొమరం భీం, ఆగస్ట్ 23: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడి 10నెలలు దాటుతున్న జిల్లా కేంద్రంలోని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల మాస్టారులకు ఇంకా ఆదిలాబాద్ జిల్లా గానే కొనసాగుతుంది అని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు జిల్లాలోని గ్రామాల్లో ఉన్న 80%పాఠశాలల యొక్క బోర్డ్‌ల మీద ఇంకా జిల్లా ఆదిలాబాద్ గానే రాసి ఉండటం గమనార్హం. పిల్లలకు పాఠాలు నేర్పే గురువులు కూడా ఇంకా మేల్కోకపోతే ఏలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో విద్యార్ధులను మీది ఏ జిల్లా అని అడిగితే వాళ్లు ఆదిలాబాద్ అంటారే కాని కొమురం భీం అని అంటారా అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరో పక్క జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు మురికి కాలువలను తలపిస్తున్నయంటూ ఆరోపిస్తున్నారు. మురికి నీరు పాఠశాల ముందు నుండే పారుతుంది. పాఠశాల ముందు చెత్త, చెదారాలతో అపరిశుభ్రత వాతావరణం చోటు చేసుకుంటుంది. దీంతో వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్న మాస్టార్లు ఒక ఐదు వందలో వెయ్యి ఖర్చు పెట్టి పాఠశాలల ఇటు జిల్లా పేరును మార్చడానికి, అటు పరిశుభ్రతకు పూనుకోలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.