సీబీఎస్ఈ ఫలితాలు:స్మృతి ఇరానీ కూతురికి 82 శాతం

SMTV Desk 2019-05-07 11:19:16  Smriti Irani ,

ఈ రోజు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తమ కూతురు మంచి ఫలితాలు సాధించిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. నా కూతురు 82 శాతం మార్కులు సాధించింది. గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. వారం రోజుల క్రితం వెలువడిన ఇంటర్ పరీక్షల్లో ఆమె కుమారుడు ఝోర్ ఇరానీ 90 శాతంలో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ఆమె తెగసంబరపడిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆమె ప్రచారం చేస్తూనే కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటున్నారు. బిజెపి తరుఫును అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సిబిఎస్‌ఇ బోర్డు విడుదల చేసిన పదో తరగతి ఫలితాలో 500 మార్కులకు గాను 499 మార్కులు 13 మంది విద్యార్థులు తెచ్చుకొని తొలి స్థానంలో ఉన్నారు. 498 మార్కులు 28 మంది విద్యార్థులకు వచ్చాయి. సిబిఎస్ఇ ఫలితాలలో మొత్తం 91.1 శాతం ఉత్తీర్ణత సాధించారు. 99.85 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్ర తొలి స్థానంలో ఉంది