ఇప్పుడున్న హీరోల్లో వీళ్లంతా కూడా అలాంటి అంకితభావం కలిగివున్న వారే

SMTV Desk 2019-05-06 18:50:35  vijay deverakonda, nikhil, raj tharun, rajaravindra

తాజా ఇంటర్వ్యూలో రాజారవీంద్ర మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చిత్రపరిశ్రమ పట్ల గౌరవం ఉండాలి .. సినిమాను దైవంగా భావించాలి. అలాంటి అంకితభావంతో ఇక్కడ అడుగుపెట్టినవాళ్లే సక్సెస్ అవుతారు .. లేదంటే ఖాళీగా వుండిపోతారు. సినిమాను ప్రాణంగా భావించేవాళ్లు ఎప్పటికీ ఖాళీగా ఉండరని ఒకసారి నాతో చిరంజీవిగారు అన్నారు. అప్పటి నుంచి నేను అదే అంకితభావంతో పనిచేసుకుంటూ వస్తున్నాను.

ఇప్పుడున్న హీరోల్లో విజయ్ దేవరకొండ .. నిఖిల్ .. రాజ్ తరుణ్ వీళ్లంతా కూడా అలాంటి అంకితభావం కలిగివున్న వారే. ముఖ్యంగా నిఖిల్ .. రాజ్ తరుణ్ కి సినిమానే ప్రపంచం. ఇక వాళ్లు రెండో విషయాన్ని గురించి పట్టించుకోరు. సునీల్ కూడా అంతే .. వివిధ భాషల్లోని సినిమాలను చూస్తూ, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక మిగతా హీరోలంతా కూడా కృషి చేస్తూనే వుంటారు .. లేదంటే వాళ్లు ఆ స్థానానికి చేరుకోలేరు గదా" అని చెప్పుకొచ్చారు.