నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

SMTV Desk 2019-05-06 18:48:40  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: సోమవారం దేశీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం నుంచి అమెరికా-చైనా చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ 25 శాతం సుంకం పెంచుతానని హెచ్చరించడంతో మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. ప్రధానంగా లోహరంగ సూచీ 2 శాతం నష్టపోయింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 379 పాయింట్లు నష్టంతో 38,584 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 11,599 వద్ద ముగిశాయి.