ఈవీఎం బీప్ శబ్ధం రాలేదు.. ఈవీఎంను పగలగొట్టాడు

SMTV Desk 2019-05-06 18:35:35  evm,

ఈ రోజు 5వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి .. అయితే ఈ నేపథ్యంలో ఒక విచిత్రసంఘటన చోటుకేసుకుంది .. కోపం లో ఓ వ్యక్తి చేసిన పనికి ఎన్నికల అధికారులు షాక్‌కు గురయ్యారు. బీహార్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా వేళా .. రంజిత్ పాశ్వాన్ అనే వ్యక్తి ఓటు వేసేందుకు చాప్రాలోని 133వ నెంబర్ పోలింగ్ బూత్ కేంద్రానికి వెళ్లాడు.

లోపలికి వెళ్లిన రంజిత్ ఓటు వేశాక బీప్ శబ్ధం రాలేదు. దీంతో అతగాడికి చిర్రెత్తుకొచ్చి ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలు ముక్కలైంది. ఏం జరిగిందో తెలుసుకున్న అధికారులు రంజిత్ తీరును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంజిత్ పాశ్వాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.