ఇరాన్‌ దిశగా వెళ్తున్న అమెరికా యుద్దనౌక

SMTV Desk 2019-05-06 17:15:49  America, gulf waters, uranium exports, USS Abraham Lincoln war ship

టెహ్రాన్‌: ఇరాన్ వైపు యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ను పంపిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ చెప్పారు. అమెరికా సంయుక్త దళాలపై దాడులు జరిగే అవకాశమున్నందున ముందుచూపుతో ఈ చర్య చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌తో యుద్దం చేసే ఉద్దేశం తమకు లేదని, కానీ పరిస్థితి అనివార్యమైతే యుద్ద నౌకను ప్రతిదాడికి దింపుతామని ఆయన తెలిపారు. ఇరాన్‌ చేపడుతున్న అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా యురేనియం ఎగుమతులు చేస్తుంది. దీంతో ఇరాన్‌తో ఉన్న అణు ఒప్పందాన్ని ఇటీవల అమెరికా త్యజించిన విషయం తెలిసిందే.