కేరళకు వెళ్లిన తెలంగాణ సీఎం

SMTV Desk 2019-05-06 17:11:23  KCR, Kerala,

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం కేరళ పర్యటనకు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.

మే 13వ తేదీ సాయంత్రం 4.30గంటలకు చెన్నైలో డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్‌తో సిఎం కెసిఆర్‌ సమావేశం కానున్నారు. దేశ రాజకీయాలపై స్టాలిన్‌తో చర్చించనున్నారు. కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో సిఎం కెసిఆర్‌తో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్‌లో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడనికి ఇప్పటికే కెసిఆర్ ఫెడరల్ ప్రెంట్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే నేడు సిఎం ఇతర రాష్ట్రాల నేతలతో భేటీ కానున్నారు.