అమెరికా బెదిరింపులకు టర్కీ తలొగ్గదు!

SMTV Desk 2019-05-06 16:39:20  turkey vice president, Fuat Oktay

అంకారా: శత్రు దేశాల క్షిపణుల దాడులను అడ్డుకునేందుకు మిత్రదేశమైన రష్యా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నామని, ఎట్టి పరిస్థితిలోనూ అమెరికా ఆంక్షలకు తలొగ్గమని టర్కీ ఉపాధ్యక్షుడు ఫ్యుట్‌ ఆక్టే ఉద్ఘాటించారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుంటే భారీ ఆంక్షలు మోపుతామంటూ అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆక్టే తెలిపారు. అమెరికా ఆంక్షలకు, బెదిరింపులకు టర్కీ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. టర్కీ, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను అమెరికా అడ్డుకోలేదని అన్నారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినట్టయితే ఎఫ్‌-35 యుద్ధ విమానాలను టర్కీకి అందజేయలేమని అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్‌ షానహాన్‌ పేర్కొన్నారు.