ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ని నియమించలేదా?

SMTV Desk 2017-08-23 18:04:46  Govt. Hospitals, Asifabad, JAC, Govt Doctors, Emergency

ఆసిఫాబాద్, ఆగస్ట్ 23: మంగళవారం నాడు వాంకిడి మండలం స్థానిక బెండరా గ్రామం‌లో ఘోర రోడ్డు ప్రమాదం‌లో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి‌కి తరలించడం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో వైద్యులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వారికి ఆసుపత్రి నర్స్‌లు తాత్కాలిక చికిత్స చేశారు. మరి డ్యూటీ లో ఉన్న డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు?? జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎలా ఉండాలి? కనీస వసతులు కూడా లేవు. అత్యవసర సమయంలో డాక్టర్ అందుబాటులో ఉండట్లేదు అంటూ స్థానికులు ఆగ్రహిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక పర్మినెంట్ డాక్టర్ అయినా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జిల్లా ముఖ్య ఆసుపత్రి కనుక ఒక డాక్టర్ అయిన సమయానికి ఉంటే ఈ రోజు కనీసం ఒక ప్రాణం అన్న మిగిలేది అని జిల్లావాసులు వాపోతున్నారు. డాక్టర్లు సమయానికి అందుబాటులో లేక చికిత్స అందక ఆసిఫాబాద్ నుండి మంచిర్యాలకు 60కి.మీ దూరం తీసుకెళ్ళే వరకు క్షతగాత్రుల పరిస్థితి ఇంకా విషమంగా మారి మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.