ఆ ప్రయోగాలు వల్ల ప్రపంచానికే ప్రమాదం: దక్షిణకొరియా

SMTV Desk 2019-05-06 16:38:28  North Korea on Sunday shows rocket launchers firing, south korea

సియోల్: ఉత్తరకొరియాపై మరోసారి దక్షిణకొరియా పలు ఆరోపణలు చేసింది. ఎంతమంది ఎన్నిసార్లు ఎంతగా చెబుతున్నప్పటికీ ఉత్తరకొరియా తన తీరును మార్చుకోవడం లేదని దక్షిణకొరియా ఆరోపించింది. తాజాగా ఆ దేశం వివిధ రకాలైన క్షిపణులను పరీక్షించిన ఫొటోలను దక్షిణకొరియా విడుదల చేసింది. ఉత్తరకొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాన్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారని పేర్కొంది. అణ్వాయుధ పరీక్షలు ఉత్తరకొరియా కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు వెంటనే ఈ తీరుపై దృష్టి పెట్టాలని కోరింది. ఉత్తరకొరియా చేస్తున్న క్షిపణుల ప్రయోగం ఆసియా ఖండానికే కాకుండా యవత్ ప్రపంచానికి కూడా ప్రమాదకరంగా మారడం ఖాయమని దక్షిణ కొరియా హెచ్చరించింది.