రెట్టింపు కానున్న బంగారం కొనుగోళ్ళు

SMTV Desk 2019-05-06 16:34:57  Gold Rate, Silver rate, Bullion market

బంగారు ఆభరణాల కొనుగోలు అక్షయ తృతీయ సందర్భంగా రెట్టింపు కానున్నాయని జ్యూవెలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధరలు కూడా నిలకడగా ఉండడంతో కొనుగోలుదారులు కూడా నగలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ అక్షయ తృతీయ పండగకు అమ్మకాలు ఈసారి రికార్డు స్థాయిలో నమోదవుతాయని ట్రేడర్లు, రిటైల్‌ వర్తకులు భావిస్తున్నారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారానికి డిమాండ్‌ 20 శాతం పెరుగుదల ఉంటుందని భారత బులియన్‌, జ్యూవెలర్ల అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. ఈనెల 7న అక్షయ తృతీయ సందర్భంగా పలు జ్యూవెలరీ​ సంస్థలు, దుకాణాలు బంగారు ఆభరణాలపై ఆఫర‍్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.