సద్దుమణిగిన ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ మధ్య బాంబుల దాడులు‌!

SMTV Desk 2019-05-06 16:32:34  Israel

ఇజ్రాయెల్: ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్‌ మధ్య వివాదం చెలరేగడంతో పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. అయితే ఈ రోజు ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగాయి. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాజా ఘర్షణలో కనీసం నలుగురు ఇజ్రాయెల్ పౌరులు, 23 మంది పాలస్తీనావాసులు మృత్యువాతపడ్డారు.2014 ఆగస్టు అనంతరం ఘర్షణ ఇంత తీవ్ర స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి.కాల్పుల విరమణపై అంగీకారం గురించి గాజాను నియంత్రిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌కు చెందిన ఓ టీవీ కేంద్రం తెలిపింది.ఈ అంశం గురించి ఇజ్రాయెల్ ఇంతవరకూ స్పందించలేదు.ఐక్య రాజ్య సమితి సహా అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని ఇరువర్గాలకూ పిలుపునిచ్చింది.