ప్రియుడితో కలిసి కూతురిపై అత్యాచారం చేయించిన తల్లి

SMTV Desk 2019-05-06 15:09:13  Sara Packer and Jacob Sullivan, Man pleads guilty in rape, murder, dismemberment of girlfriends teen daughter, murder of her daughter

న్యూయార్క్: న్యూయార్క్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కూతురిపై అత్యాచారం చేయించి ముక్కలు ముక్కలుగా నరికి చంపేసింది ఓ తల్లి. అయితే ఆ తల్లికి యావజ్జీవ శిక్ష విధించగా, నిందితుడికి ఉరిశిక్ష విధించింది కోర్టు. పూర్తి వివరాల ప్రకారం...సారా, డేవిడ్ అనే దంపతులు అనాధలను దత్తత తీసుకునేవారు. సారా దత్తత విషయాలు చూసే అధికారిణిగా పని చేస్తూ ఉండేది. దీంతో సారా భర్త డేవిడ్ దత్తత తీసుకున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తు ఉండేవాడు. గ్రేస్ అనే అమ్మాయిపై డేవిడ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రేస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డేవిడ్‌ను అరెస్టు చేయడమేకాకుండా సారాను ఉద్యోగంలో నుంచి తొలిగించేశారు. వాళ్లు అనాధలను దత్తత తీసుకొవద్దని కోర్టు హెచ్చరించింది. దీంతో గ్రేస్‌పై సారా పగ పెంచుకుంది. సారా తన ప్రియుడు జాకబ్‌తో కలిసి గ్రేస్‌ను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక రోజు గ్రేస్‌ను జాకబ్ లైంగికంగా వేధించడమేకాకుండా అమ్మాయిని చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. అనంతరం జాకబ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల తరువాత అమ్మాయి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనంతరం గ్రేస్ ఇంకా చావకపోవడంతో జాకబ్, సారా కలిసి అమ్మాయిని ముక్కలు, ముక్కలుగా నరికి ఊరు శివారులో పడేశారు. సారా స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేసింది. ఊరు బయట శవం ఉందని మీ కుమార్తెదేనా అని సారాను పోలీసులు ప్రశ్నించారు. ఆమె నుంచి జవాబు రాకపోవడం సరి.. ఆమెలో ఎటువంటి బాధ లేకపోవడంతో పోలీసులు అనుమానించారు. పోలీసులు తనదైన శైలిలో తల్లిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. విచారణ జరిపిన కోర్టు .. సారాకు యావజ్జీవ శిక్ష జాకబ్‌కు ఉరి శిక్ష వేసింది.