రజనీని ఒక్కసారి కలవాలి!

SMTV Desk 2019-05-06 12:48:34  dj bravo, csk, super star rajinikanth

చెన్నై: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు డ్వేన్‌ బ్రావో తమిళ సంస్కృతి, సాంప్రదాయాలపై తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రావో తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమిళ సంస్కృతి, సాంప్రదాయాలపై ప్రశంసలు కురిపించాడు. దీంతో ధోనితో పాటు బ్రావోను కూడా తమిళులు స్వంత మనిషిలా చూస్తుంటారు. ఐతే రజనీని కలవాలని ఉందని బ్రావో తాజాగా వెల్లడించాడు. రజనీ గురించి విన్నానని, అందుకే ఆయన్ను ఒక్కసారి కలుస్తానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ గురించి మాట్లాడాడు.