టాప్ 6 కంపెనీలు....రూ.64,219 కోట్ల నష్టం

SMTV Desk 2019-05-06 12:18:50  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: పోయిన వరం షేర్ మార్కెట్లో టాప్ 10 కంపెనీల్లో ఆరు సంస్థలు దాదాపు రూ.64,219 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. వీటిలో ఐటి దిగ్గజం టిసిఎస్ అత్యంతగా నష్టపోయింది. గత వారాంతం శుక్రవారం నాటికి టాప్ 10 కంపెనీల్లో మిగతా సంస్థలు ఐటిసి, హెచ్‌యుఎల్, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్‌ల మార్కెట్ విలువ ఆవిరి అయింది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు మాత్రమే లాభపడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) మార్కెట్ విలువ రూ.39,700 కోట్లు కోల్పోయి రూ.8,00,196 కోట్లకు చేరింది. ఇక హెచ్‌యుఎల్ విలువ రూ.11,029 కోట్లు క్షీణించి రూ.3,66,441 కోట్లు అయింది. ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ.5,832 కోట్లు తగ్గి రూ.3,16,201 కోట్లకు చేరింది.ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.3,558 కోట్లు నష్టపోయి రూ.2,59,087 కోట్లకు చేరింది. ఎస్‌బిఐ విలువ కూడా రూ.2,811 కోట్లు తగ్గి రూ.2,75,904 కోట్లకు చేరింది.