మార్కెట్లపై ఎన్నికల ప్రభావం తప్పదు!

SMTV Desk 2019-05-06 12:14:17  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ వారంలో కూడా మార్కెట్లు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వారంలో సేవా రంగానికి సంబంధించిన పిఎంఐ డేటా వెలువడనుంది. అలాగే పలు బ్లూచిప్ కంపెనీలు ఈ వారంలో క్యూ4 ఫలితాలను వెల్లడించేందుకు సిద్దం అయ్యాయి. ఇప్పటికే ఐటి, ఎఫ్‌ఎంసిజి తదితర రంగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి. అలాగే ఇంకా చాలా కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. మొబైల్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రైవేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఈ నెల 6న, అలాగే 7వ తేదీన వేదాంతా, ఈనెల 9న ఇత ర దిగ్గజాలు ఏసియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లు ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే బాటలో 10న ఎల్ అండ్ టి, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఫలితాలు ప్రకటించనున్నాయి. సార్వత్రిక ఎ న్నికలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఐదో దశ పోలింగ్‌ను 6న నిర్వహించనుంది. 7రాష్ట్రాల్లో 51 లోక్‌సభ సీ ట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19కల్లా అన్ని దశల పోలింగ్ పూర్తి అవుతాయి. ఆ తర్వాత ఫలితా లు 23న వెల్లడించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో మారకంలో రూపా యి కదలికలను పరిశీలించాలి. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు మార్కెట్ల ను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.