మైనర్ బాలికపై మూడేళ్లుగా అత్యాచారం...సదరు టీచర్ నిర్వాకం

SMTV Desk 2019-05-06 12:11:31  minor rape, sexual abuse, sexual harassment

తన వద్ద చదువుకునే విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ ఉపాధ్యాయుడికి కామంతో కళ్లు మూసుకుపోయాయి. దీంతో అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్లుగా బాలికతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. అయితే ఎలాగోలా చివరకు ఈ విషయం బయటపడి సదరు కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

బాధిత బాలిక పదమూడేళ్ల వయసులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు 56 ఏళ్ల ఉపాధ్యాయుడు కన్నేశాడు. ఆమెను ఎలాగైన లొంగదీసుకోవాలని అవకాశం కోసం ఎదురుచూశాడు. అయితే ఆ అవకాశం రానే వచ్చింది. బాలికకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సంపాదించి బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించారు. అయితే తన ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భావించిన బాలిక ఆ నీచుడికి తలవంచింది. ఇలా దాదాపు మూడెళ్లుగా ఆమెపై నిత్యం అత్యాచారానికి పాల్సడుతూ వస్తున్నాడు.

అయితే బాదిత బాలిక స్కూలింగ్ ముగించుకుని కాలేజీలో చేరినా అతడు వదల్లేదు. తరచూ ఆమెను పిలుచుకుని అత్యాచారం చేసేవాడు. అయితే ఈ మధ్యకాలంలో అతడి లైంగిక వేధింపులు మరీ ఎక్కువవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తాను చదివే కళాశాల ఉపాధ్యాయులకు ఈ విషయం గురించి తెలియజేసి బోరున విలపించింది. దీంతో వారు బాలిక పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడి ఆ కీచక టీచర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కామాంధుని అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు న్యాయస్థానంలో కూడా కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.