మనమరాలి వయస్సున్న బాలికలను అత్యాచారం చేసిన రిటైర్ద్ ఉద్యోగి

SMTV Desk 2019-05-06 12:08:21  rape, minor rape, sexual harassment, poor girls

లక్నో, మే 06: మనమరాలి వయస్సున్న బాలికలను ఫోర్న్ వీడియోలు చూస్తూ అత్యాచారం చేసేవాడు. పేదరికం కారణంగా బాలికలను ఆ వ్యక్తి లొంగదీసుకొన్నాడు. అంతేకాదు ఈ దృశ్యాలను ఆయన రికార్డు చేసుకొన్నాడు. ఎట్టకేలకు ఆయన దారుణాలు వెలుగు చూశాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన విమల్ చంద్‌కు 63 ఏళ్లు. ఆయన భీమా సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేశాడు. 2016లో ఆయన రిటైరయ్యారు. విమల్ చంద్ రిటైరైన ఏడాదే ఆయన భార్య అనారోగ్యంతో మృతి చెందింది.

విమల్ చంద్ కూతురు విదేశాల్లో ఉంటుంది. విమల్ చంద్ ఒక్కడే తన పెద్ద బంగాళాలో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజూ వవిమల్ చంద్ గుడికి వెళ్లేవాడు. అంతేకాదు పేదలకు బట్టలు, డబ్బులు ఇచ్చేవాడు. ఈ రకంగా పైకి కన్పిస్తూ బాలికలను లొంగదీసుకొనేవాడు.

రెండేళ్లుగా తన ఇంట్లోనే విమల్ చంద్ బాలిలకపై అత్యాచారానికి పాల్పడేవాడు. విమల్ చంద్ ఇచ్చే డబ్బుల కోసం బాలికలు ఇంటికి వచ్చేవాళ్లు. హాల్, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, వంటగది, బాత్‌రూమ్‌లలో కూడ 13 సీసీ కెమెరాలను పెట్టించాడు. వీటిలో కొన్ని పాడయ్యాయి. గత నవంబర్‌లో కశ్యప్ అనే టెక్నీషీయన్‌ను పిలిపించాడు.

సీసీ కెమెరాలను మరమ్మత్తులు చేయాలని కోరాడు. అయితే కశ్యప్ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను చూసి షాకయ్యాడు. కొన్ని దృశ్యాలను ఆయన డీవీఆర్‌‌లో డౌన్‌లోడ్ చేసుకొన్నాడు. కశ్యప.... విమల్ చంద్‌ను డబ్బులు డిమాండ్ చేశాడు. లేకపోతే దృశ్యాలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో పోలీసులను విమల్ చంద్ ఆశ్రయించారు. ఈ సమయంలోనే విమల్ చంద్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. విమల్ చంద్, కశ్యప్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.