ప్రారంభమైన 5వ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్

SMTV Desk 2019-05-06 12:00:18  Elections,

ఏడు దశలలో కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికలలో 5వ దశకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైంది. ఈరోజు ఉత్తరప్రదేశ్(14), రాజస్థాన్ (12), పశ్చిమబెంగాల్ (7), మధ్యప్రదేశ్ (7), బిహార్ (5), ఝార్ఖండ్ (4), జమ్ముకశ్మీర్‌లో:1 స్థానానికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ 51 ఎంపీ స్థానాల కోసం మొత్తం 674 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈరోజు పోలింగులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, స్మృతీ ఇరానీ, సహాయ మంత్రులు జయంత్‌సిన్హా, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, అలనాటి ప్రముఖ హిందీ సినీ నటుడు శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హా తదితర ప్రముఖుల భవిష్యత్ ఓటర్లు తేల్చనున్నారు.

ఈరోజు జరుగుతున్న 5వ దశ లోక్‌సభ ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మిగిలిన 118 నియోజకవర్గాలకు మే 12, 19 తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. మే 23వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు