చెలరేగిన రాహుల్ .. చెన్నై చిత్తు

SMTV Desk 2019-05-06 11:54:09  Rahul. KL Rahul

పంజాబ్... చెన్నై పై విజయ బేరి మ్రోగించింది .. విజయం తో ది ఐపీఎల్ 12 కి వీడ్కోలు పలికింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత చెన్నై కి బ్యాటింగ్ అప్పగించింది .. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. పంజాబ్ కు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.సురేష్ రైనా(53), డుప్లేసిస్(96) ఆకట్టుకున్నారు .. తరువాత పంజాబ్ ఓపెనర్ లోకేష్ రాహుల్ చెలరేగడం తో 171 లక్ష్యాన్ని 18 ఓవర్స్ లో పూర్తి చేసారు ..

చెన్నై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ 71, క్రిస్ గేల్ 28, పూరన్ 36 పరుగులతో రాణించడంతో జంజాబ్ జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో హర్బజన్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా… రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.