ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్‌ మధ్య చెలరేగిన వివాదం....బాంబులతో దాడులు

SMTV Desk 2019-05-06 11:52:14  Israel

ఇజ్రాయెల్: ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్‌ మధ్య వివాదం చెలరేగింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ నుంచి వచ్చి పేలుతున్న బాంబులకు భవనాలు బూడిదగా మారుతున్నాయి. పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. వాటిలో అత్యధిక రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ పేర్కొంది.రాకెట్ దాడులకు ప్రతిగా ఈ వారాంతంలో గాజా స్ట్రిప్‌లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.ఆ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని పాలస్తీనియన్లు చెప్పారు.ఇరు పక్షాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి.