కన్నతండ్రి వద్దు...ప్రియుడే ముద్దు

SMTV Desk 2019-05-06 11:51:20  Nuzvid IIIT Girl Wants to go with Lover, father and daughter

అమరావతి: బీటెక్ పూర్తయిన విద్యార్థిని హాస్టల్ నుండి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రితో వెళ్ళకుండా తానూ ప్రేమించిన వ్యక్తి దగ్గరే ఉంటా అని గొడవ చేసింది. దీంతో ఏం చేయాలో తెలీక హాస్టల్ సిబ్బంది పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని నిర్వాకం ఇది. పూర్తి వివరాల ప్రకారం....గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన జ్యోత్స్న అనే విద్యార్థిని ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే, గతేడాది ఇంటర్న్ షిప్ కు వెళ్లిన సమయంలో ఆమెకు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మురళి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో వారించాడు. ఈ క్రమంలో శనివారం నాడు థర్డ్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. దాంతో కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి కళాశాలకు వచ్చాడు. అయితే, తండ్రితో వెళితే పెళ్లి చేస్తారని, అది తనకు ఇష్టం లేదని చెప్పిన జ్యోత్స్న ఆయనతో వెళ్లేందుకు మొండికేసింది. దీంతో ఆమె తండ్రి కళాశాల సిబ్బందికి విషయం చెప్పాడు. వారు జ్యోత్స్నను నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఆమె వినకపోవడంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నూజివీడు సిఐ స్వయంగా ఆమెకు కౌన్సెలింగ్ చేశారు. అయిన తండ్రితో వెళ్లేందుకు జ్యోత్స్న ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమిలేక ఆమె ప్రియుడు మురళిని పిఎస్ కు పిలిపించాలని నిర్ణయించినట్లు పోలీసులు తెలిపారు.