సౌతాఫ్రికాలో సినీ స్టార్స్ క్రికెట్

SMTV Desk 2019-05-06 11:20:05  telugu film stars cricket match in southafrica

సౌతాఫ్రికాలో: క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ తల్వార్ ఆధ్వర్యంలో సినీ స్టార్స్ సౌతాఫ్రికాలో ఛారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తల్వార్ క్రికెట్ జట్టు జెర్సీ లాంచ్ ను రానా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ తల్వార్స్ ఛీఫ్ అభినవ్ సర్థార్ తో పాటు సినీ హీరోలు శ్రీకాంత్, సునిల్, సామ్రాట్, ప్రిన్స్ పాల్గొన్నారు.. జొహెన్నెస్ బర్గ్ లో సెంచూరియన్ గ్రౌండ్ లో ఈ చారీటీ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా సినీ నటుడు దగ్గుపాటి రానా మాట్లాడుతూ...సామాజిక సేవలో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది అని స్పష్టం చేశారు.