మీది గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఆ..!

SMTV Desk 2019-05-06 11:18:10  rh null, rh null blood group

మానవ శరీరాల్లో అత్యంత అరుదుగా లభించే బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్ . కానీ దీనికంటే అరుదైన మరో బ్లడ్ గ్రూప్ గోల్డెన్ బ్లడ్ . ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు కానీ, వారికి రక్తం ఇచ్చేవారు దొరకరు. సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ రక్తం గ్రూపుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్(Rh null).మాములుగా రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. ఏ గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. బీ గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ రెండూ ఉండవు. అలాగే, ఎర్ర రక్త కణాలు 61 Rh- రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు.Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. అంతేకాదు, ప్రాణాలను కాపాడటంలో ఇతర గ్రూపుల రక్తంతో పోల్చితే Rh null ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. కానీ, అది దొరకడం అంత సులువైన పనికాదు. అందుకే, దాన్ని గోల్డెన్ బ్లడ్ అంటారు" అని పారిస్‌లోని నేషనల్ రెఫరెన్స్ ల్యాబ్ ఇన్ ఇమ్యూనోహెమటాలజీ డైరెక్టర్ డాక్టర్. థియెర్రీ పెరార్డ్ వివరించారు.అయితే, Rh null కలిగిన వారు కొద్దిపాటి రక్తహీనతతో బాధపడే అవకాశం ఉందని అమెరికాలోని అరుదైన రుగ్మతల సమాచార కేంద్రం పేర్కొంది.ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయో కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు. అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు. అయినా, చాలామందికి నిరాశే ఎదురైంది.