లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమా ‘మిస్టర్ లోకల్’. ఈ మూవీ కి ఎమ్. రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించారు. కార్తికేయ క్రీడల్ని ఇష్టపడే వ్యక్తిగా ఈ ట్రైలర్ లో కనిపించారు. ‘మిస్టర్ లోకల్’ సినిమాలో రాధిక, యోగిబాబు, తంబి రామయ్య, సతీష్, రోబో శంకర్, హరిజ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హిప్‌హాప్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.