సచిన్ వల్లే నాకీ గుర్తింపు: అఫ్రిది

SMTV Desk 2019-05-05 18:50:25  sahid afridi, pakistan cricketer, sachin tendulkar

ఇస్లామబాద్: పాకిస్తాన్ మాజీ కాప్టెన్ షాహిద్ అఫ్రీది తన ఆటో బయోగ్రఫీని గేమ్ ఛేంజర్ అనే పుస్తకరూపంలో అభిమానులు ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఆ పుస్తకంలో భారత క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పకొచ్చాడు.. 1996లో అఫ్రిది అంటే ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పిన ఇన్నింగ్స్ అంటే 37 బంతుల్లో రికార్డు సెంచరీనే అని చెప్పాలి. 1996లో నైరోబీ వేదికగా శ్రీలంకపై అఫ్రిది ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ తో అతడి పేరు మార్మోగిపోయింది. 11 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. ఆరోజు అఫ్రిది కారణంగా లంక బౌలర్లకు పీడకలలే మిగిలాయి. అయితే, ఆ రోజు తాను ఆడింది సచిన్ బ్యాటుతో అని అఫ్రిది తన ఆత్మకథలో వెల్లడించాడు."సచిన్ తనకెంతో ఇష్టమైన బ్యాటు కొలతలతోనే మరో బ్యాటు తయారుచేయించమని వకార్ యూనిస్ కు పాత బ్యాటు ఇచ్చాడు. పాకిస్థాన్ లోని రావల్పిండి అంటే క్రీడా ఉపకరణాల తయారీకి పెట్టింది పేరు. అయితే వకార్ యూనిస్ ఆ బ్యాటును రావల్పిండి తీసుకెళ్లడానికి ముందు నాకిచ్చాడు. ఆ బ్యాటుతోనే లంక బౌలర్లను చితకబాదాను" అంటూ వివరించాడు.