చైనా మార్కెట్లోకి సన్‌ఫార్మా

SMTV Desk 2019-05-05 18:36:57  sun pharma, china, india, sun pharma enters china markets

ముంభై: సన్‌ఫార్మా సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో చైనా ఔషధ రంగ మార్కెట్లో మోజార్టీ వాటాను పొందడంపై దృష్టి పెట్టింది. అంతేకాక అక్కడి ప్రభుత్వం ఔషధాల ధరల తగ్గింపుపై దృష్టిపెట్టింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు చైనాలో ఒక వ్యాపార భాగస్వామికోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది మాకు మంచి అవకాశం. ఇప్పటి వరకు దేశ మార్కెట్లో పెద్దగా అవకాశాలు లేని చోట ఇప్పుడు సరికొత్త ఆదాయ వనరులు రానున్నాయి. అని సంఘ్వి ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.