రైలు ఆలస్యం వల్ల నీట్ ఎగ్జామ్ రాయలేకపోయిన 500 మంది విద్యార్థులు

SMTV Desk 2019-05-05 18:35:48  bangalore students, neet exam, mbbs, bds, exam hall

బెంగళూరు, మే 05: కర్ణాటకలో రైలు ఆలస్యంగా నడవడంతో 500 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయలేకపోయారు. ఉత్తర కర్ణాటక నుండి బెంగళూరు వెళ్ళాల్సిన ట్రైన్ షెడ్యూల్ కంటే 6 గంటలు ఆలస్యం అయ్యింది. MBBS, BDS జాతీయ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉండడంతో కర్ణాటకలోని వేలాది మంది విద్యార్థులు బెంగళూరు సెంటర్ ను సెలెక్ట్ చేసుకున్నారు.

మధ్యాన్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష ఉండడంతో ఉదయం 7, 8 గంటలలోగా బెంగళూరు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. అయతే, బళ్ళారి, హుబ్లి నుండి వచ్చే హంపి ఎక్స్ ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా నడిచింది.

ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చిన కేంద్ర మానవవనరుల మంత్రి స్పందించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.. రైళ్ల ఆలస్యంపై మాజీ సీఎం సిద్దరామయ్య ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలోమా రైల్వే శాఖ నిర్లక్ష్యంతో తమ రాష్ట్ర విద్యార్థులు నీట్ రాయలేకపోయారని మండిపడ్డారు. మరోసారి అవకాశం ఇవ్వాలంటూ మోదీని కోరిన సిద్దరామయ్య.