బయటికి వెళ్ళినపుడు ఇలా మాత్రం చేయకండి..!!

SMTV Desk 2017-08-23 14:53:21  friendship, money issue, cinema hall restarents, long tour

హైదరాబాద్, ఆగస్ట్ 23: స్నేహం అనేది ఎంతో మధురమైనది. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. ఎన్ని తరాలు మారినా మారనిది స్నేహం ఒక్కటే. రక్తసంబంధం కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు నేటి తరం. "సృష్టిలో తీయనిది స్నేహమేనోయి" అన్నారో కవి. నిజమే సృష్టిలో కొన్ని౦టికి వెల కట్టలేము ఇలాంటి వాటిలో స్నేహానికి అగ్రస్థానం. ఇలాంటి స్నేహితుల మధ్యలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. కొంతమంది స్నేహితులు డబ్బు గురించి పట్టించుకోరు ఎవరో ఒకరు ఇస్తారులే అనుకుంటారు. కాని అలా ఖర్చుల విషయం ఒకరిపై వదిలిస్తే భారం అవుతుంది. దీంతో చిరాకు, కోపం వస్తుంటాయి. అలా కాకుండా ఖర్చుల విషయంలో ప్రతి ఒక్కరు పంచుకుంటే ఈ చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. దాని కొరకు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది... *ఈ రోజుల్లో రెస్టారెంట్లు, కాఫీ షాపులూ, సినిమాహాల్లు ఇక్కడ చూసిన స్నేహితులే ఎందుకంటే వారు కలవడానికి మాట్లాడుకోవడానికి అవే వేదిక. ఆ విధంగా స్నేహితులు అంత కలిసి బయటికి వెళ్ళినప్పుడు డబ్బుల గురించి పట్టించుకోరు ఎవరో ఒకరు ఇస్తారులే అని అనుకుంటారు. అలా ఒకట్రెండుసార్లు అయితే పర్లేదు కానీ తరచు ఇలా అనుకుంటే స్నేహితులకు చెడు అభిప్రాయం వస్తుంది. కనీసం ఎంత ఖర్చయిందో తెలుసుకుంటే మరో సరి బయటికి వెళ్ళినప్పుడు ఆ బిల్ మిరే కట్టేయొచ్చు. *ఎవరైనా మిమ్మల్ని తోడుగా బయటికి తీసుకెళ్తే మీ ఖర్చులు కూడా వారే భరించాలి అనుకోకండి ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ తరచూ అది మంచిది కాదు. *డబ్బుల గురించి ఆలోచించాలి కానీ బిల్లు రాగానే ఎక్కడపడితే అక్కడే పంచుకోవడం మంచిదికాదు ఎవరో ఒకరు చెల్లించి బయటికి వచ్చాక చూసుకోవడం మంచిది. *ఎప్పుడైన ట్రిప్స్ ప్లాన్స్ వేసుకుంటే మీ స్నేహితులందరూ మీరకున్న౦తగ ఖర్చుపెట్టగలరో లేదో తెలుసుకొని తరువాత ప్లాన్ చేయండి.